పంచాయతీ.రాజ్ ఏ ఈ.టి నూకరాజు పోస్టుమార్టం పూర్తి
పంచాయతీ.రాజ్ ఏ ఈ.టి నూకరాజు పోస్టుమార్టం పూర్తి
పంచాయతీ.రాజ్ ఏ ఈ.టి నూకరాజు పోస్టుమార్టం పూర్తి


రాజమహేంద్రవరం:, 20 ఆగస్టు (హి.స.)

కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన పైనుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది రాజమహేంద్రవరంలోని దోబీఘాట్ ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు ముమ్మరంగా గాలించారు. మధ్యలో వర్షం వల్ల అన్వేషణకు కొంతసేపు అంతరాయం కలిగింది. గోదావరిలో దూకి దాదాపు మూడు రోజులు పూర్తవడంతో ఎక్కడైనా డొంకల్లో చిక్కుకొని ఉంటే గుర్తించేలా డ్రోన్లతోనూ పరిశీలిస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటపడి, కేసులో కీలక సమాచారం ఇచ్చిన సౌజన్య కుమారుడు కె.కార్తికేయరెడ్డి(10)ని రావులపాలెం తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఏఈ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేసిన సాధిక్ ఖాన్పై రాజమహేంద్రవరం, సర్పవరం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతను పట్టుబడితే కేసు కొలిక్కి వస్తుందని ఓ అధికారి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande