
వినుకొండ :, 20 ఆగస్టు (హి.స.)
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఈ ఘటన వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద గురువారం ఉదయం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న వల్లూరి సావిత్రి(55), ఆమె భర్త రవి(58) మిద్దె బావి కాలనీలోని తన కుమార్తె ఇంటికి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ