రోడ్డు ప్రమాదానికి.గురైన పోలీసుల. కారులో.గంజాయి
రోడ్డు ప్రమాదానికి.గురైన పోలీసుల. కారులో.గంజాయి
రోడ్డు ప్రమాదానికి.గురైన పోలీసుల. కారులో.గంజాయి


అద్దంకి, 17 ఆగస్టు (హి.స.)

, : రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీసుల కారులో గంజాయి ఉండటం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు. శంఖవరప్పాడు వద్ద ఓ ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు గాయపడ్డారు. కారులో సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, నాగరాజు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు, స్థానికులు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కారు డిక్కీలో మద్యం సీసాలు, గంజాయి సంచులున్నాయంటూ కారును అడ్డుకున్నారు. ఈ ఘటనపై దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. ‘దొంగతనాలపై దర్యాప్తులో భాగంగా అద్దంకి మండలం ధర్మవరం ప్రాంతానికి పోలీసులు ప్రైవేటు వాహనంలో వెళ్లారు. నిందితుణ్ని వెంబడించినప్పుడు తన వద్దనున్న సంచిని వదిలి పరారయ్యాడు. పోలీసులు అందులో గంజాయి ప్యాకెట్లు, బీరు సీసాలున్నట్లు గుర్తించి, కారులో తీసుకొస్తున్నారు. అప్పుడే శంఖవరప్పాడు వద్ద ప్రమాదం జరిగింది. అద్దంకి పోలీస్స్టేషన్లో సంతమాగులూరు ఎస్సై ఫిర్యాదు చేశారు’ అని డీఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande