
గిద్దలూరు టౌన్, 17 ఆగస్టు (హి.స.)
నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడు అటవీశాఖ అధికారుల కస్టడీలో ఆత్మహత్యకు యత్నించాడు. గత నెలలో రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు సమీపంలో పెద్దపులిని మరణించిన ఘటనలో అటవీ సిబ్బంది, పోలీసులు.. రాచర్ల మండలం చోళ్లవీడు గ్రామానికి చెందిన రంగస్వామి సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాలని అటవీశాఖ పిటిషన్ వేయడంతో కోర్టు అనుమతించింది. దిగువమెట్ట సమీపంలోని అటవీ కార్యాలయంలో విచారణ జరుపుతుండగా కిటికీ అద్దాలను రంగస్వామి పగులగొట్టాడు. పగిలిన అద్దం ముక్కలతో చేయ్యి, పొట్టపై గాయపరచుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ