
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీలో బిల్లులు పెట్టినప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేశారని ప్రశ్నించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచటి కాంగ్రెస్ నుంచి ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేశారని, దానం అనర్హతపై తగిన ఆధారాలు సమర్పించినా స్పీకర్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు.
దీంతో స్పందించిన ధర్మాసనం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఏం చర్యలు తీసుకుందని పిటీషనర్ను రెడ్ కార ప్రశ్నించింది. అలాగే విప్ జారీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారని ప్రశ్నించింది. బిల్లులు పెట్టినప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేశారని ప్రశ్నించింది. మూజువాణి ఓటులోనూ ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపారు? అని ప్రశ్నించగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకున్నా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదని కోర్టుకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు