విజయవాడ రైల్వే డివిజన్ కేంద్రంగా జరిగే అక్రమాల పై సీబీఐ దృష్టి సాధించడం తో భారీ కుంభకోణాలు వెలుగులోకి

అమరావతి, 17 ఆగస్టు (హి.స.)

విజయవాడ రైల్వే డివిజన్ కేంద్రంగా జరిగే అక్రమాలపై సీబీఐ దృష్టిసారించడంతో.. భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ.. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు అడ్డంగా సీబీఐకి దొరకడం సంచలనంగా మారింది. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనిని అనుకున్న లక్ష్యం కంటే ముందుగానే పూర్తిచేసినట్లు తేదీలను మార్చేసి.. గుత్తేదారు సంస్థకు రూ.7 కోట్లను బోనస్గా రైల్వే నుంచి ఇప్పించినందుకు.. రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్నట్లు సీబీఐకి ఫిర్యాదు అందడంతో.. కాపుకాసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విజయవాడ డివిజన్లో ఇంజినీరింగ్ పనులు సహా, పలు విభాగాల్లో అక్రమాలపై గత కొంతకాలంగా సీబీఐకి నేరుగా ఫిర్యాదులు వెళుతుండడంతో.. అవినీతి తిమింగలాలు అడ్డంగా దొరుకుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande