కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల.. జోగులాంబ కలెక్టర్
కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల.. జోగులాంబ కలెక్టర్
కలెక్టర్


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లాలో NHM (నేషనల్ హెల్త్ మిషన్) కార్యక్రమం కింద కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేసినట్లు, వివరాలను https://gadwal.telangana.gov.in వెబ్సైట్లోపొందుపరిచినట్లు తెలిపారు. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 18వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు లిఖితపూర్వకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, ఐడీఓసీలో సమర్పించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande