
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
నగరంలో అత్యంత రద్దీగా ఉండే KBR పార్క్ చుట్టూ వన్వే ట్రాఫిక్ విధానం రేపటి నుంచే అమలులోకి రానుంది. ఉదయం 6గంటల నుండి వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. హైసిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు ఇదే విధానం కొనసాగనుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరిజ్ కెమెరాలతో వాహనాల రాకపోకలపై నిఘా పెంచనున్నారు. వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. KBR పార్క్ సందర్శకుల కోసం ట్రాఫిక్ అధికారులు సూచించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. వన్వే విధానానికి అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే చుట్టుపక్కల ఉండే ఆసుపత్రులు, ఇతర కపెంనీల యాజమాన్యాలతో చర్చలు జరిపి సంబంధిత వివరాలను వారికి వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు