
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) కల్యాణలక్ష్మి, షాదీముబారక్ను యథాతథంగా కొనసాగిస్తామని హైకోర్టులో స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చిన్న స్టేను సాకుగా చూపి భారాస నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోవని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇప్పటివరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తామని తెలిపారు. భారాస తెచ్చిన కొన్ని పథకాలపై తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్