ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత ప్రచారం చేయాలి.. : కలెక్టర్ గరిమ అగర్వాల్
ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత ప్రచారం చేయాలి.. : కలెక్టర్ గరిమ అగర్వాల్
Collector


రాజన్న సిరిసిల్ల, 17 ఆగస్టు (హి.స.)

ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబర్ 1097, క్యూ ఆర్ కోడ్తో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ర్యాలీ ఐడీఓసీ నుంచి ప్రారంభమై సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా మానేరు వంతెన వరకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి ఐడీఓసీకి చేరుకొని ముగిసింది.

ఈ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమై 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, వైద్యం, మందులు, కౌన్సెలింగ్ కు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన చోట పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. యువత, విద్యార్థులకు అవగాహన సమావేశాలు, పోటీలు నిర్వహించి ఎయిడ్స్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande