నిర్మల్ జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..
నిర్మల్ జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..
కార్డెన్ సెర్చ్


నిర్మల్, 17 ఆగస్టు (హి.స.)

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఎస్పి పత్తిపాక సాయికిరణ్ ఆధ్వర్యంలో సోమవారం భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలేగాం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 70 ద్విచక్ర వాహనాలు, ఒక ఫోర్ వీలర్, నాలుగు ఆటోలకి సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై నిబంధనల మేరకు జరిమానాలు విధించారు. అనంతరం ఎ.ఎస్.పి గ్రామస్తులతో మాట్లాడుతూ... రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీతో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, సర్కిల్ పరిధిలోని ఎస్.ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande