గ్రూప్-1 లాంటి భారీ స్కామ్ నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గ్రూప్-1 లాంటి భారీ స్కామ్ నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu Naidu(file)


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజైన ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 నియామకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో జరిగినంత పెద్ద కుంభకోణాన్ని తానెక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రత్యేక విచారణ జరిపిన సిట్ (SIT) విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చిందని, పరీక్షా పత్రాలను కనీస అర్హత లేని ఇలెక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారని ప్రాథమిక ఆధారాలు లభించినట్లు గుర్తుచేశారు. తప్పు చేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సభలో సీఎం స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande