
కడప , 17 ఆగస్టు (హి.స.)ఎన్నికల హామీలు నెరవేర్చలేని రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు.
ఎన్నికల హామీల అమలులో భాగంగా కడప నగర సమగ్రాభివృద్ధికి 5 వేల కోట్లు రూపాయల నిధులు కేటాయించాలి. రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఆధార్ లేని వారికి నెలకు రూ.1500/-.డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, చంద్రన్న బీమా పథకం, నిరుద్యోగ భృతి, తదితర సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే మంచినీటి సరఫరా సమస్య లేకుండా ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు.సిపిఐ నాయకులు, చంద్ర వెంకట శివ, మద్దిలేటి వేణుగోపాల్, బాదుల్లా వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV