శాహీన్ నగర్లో దారుణం: పెళ్లి విషయమై వివాదంతో యువతి ఘోర హత్య
శాహీన్ నగర్లో దారుణం: పెళ్లి విషయమై వివాదంతో యువతి ఘోర హత్య
murder


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ నగరం పాతబస్తీ పరిధిలోని శాహీన్ నగర్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక దారుణమైన హత్యోదంతం వెలుగుచూసింది. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన రేహానా (21) అనే యువతి మైలార్‌దేవ్‌పల్లి వారం గడ్డ ప్రాంతంలో నివసిస్తూ ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు స్థానిక యువకుడితో ఉన్న ప్రేమ వ్యవహారం నేపథ్యంలో, గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై ఈరోజు తెల్లవారుజామున ప్రియుడి ఇంట్లో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రియుడు యువతిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి పారేయడానికి ప్రయత్నించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande