భక్తి శ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు
భక్తి శ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు
భక్తి శ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు


కర్నూలు, 17 ఆగస్టు (హి.స.) నాగుల పంచమిని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలు పాటించి, నాగదేవత ఆలయం, నాగుల పుట్టల వద్ద పూజలు నిర్వహించి అనంతరం దీక్షలను విరమించారు. ఈమేరకు సోమవారం ఆదోని, కర్నూలు, మరియు ఇతర మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఉదయం పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు నాగదేవతల విగ్రహాలను శుద్ధి చేసి ఆవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. కుంటుంబ సభ్యులంతా సుఖసంతోషలతో ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. గ్రామీణ పల్లెల్లో చెట్ల కొమ్మలకు ఊయల కట్టి సాంస్కృతిక పాటలు పాడుతూ సందడి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande