రాష్ట్రంలో ఇంధన ధరల మోత: దేశంలోనే హైదరాబాద్లో గరిష్ట స్థాయికి పెట్రోల్, డీజిల్ రేట్లు
రాష్ట్రంలో ఇంధన ధరల మోత: దేశంలోనే హైదరాబాద్లో గరిష్ట స్థాయికి పెట్రోల్, డీజిల్ రేట్లు
petrol


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు (Brent Crude) ధరలు బ్యారెల్‌కు 88.9 డాలర్లకు పెరగడంతో దేశీయంగా ఇంధన ధరలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాలతో పోలిస్తే ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు అత్యంత గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 115.69 గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 103.82 కు చేరింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ రవాణా మార్గాల అంతరాయాల వల్ల ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో రానున్న రోజుల్లో నగరంలో ఇంధన ధరలు మరింత ప్రియమవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande