తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన
The weather in Delhi-NCR took a sudden turn on Saturday, bringing strong winds and heavy rain.


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

తెలంగాణ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన బలహీన ఉపరితల ఆవర్తనం మరియు వాయువ్య దిశ నుండి వస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో విస్తారంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, మధ్య మరియు తూర్పు తెలంగాణ పరిధిలోని ప్రాంతాలలో చెదరుమదురుగా జల్లులు పడతాయని, రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande