
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలను వచ్చే సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కచ్చితంగా హాజరుకావాలని, అసెంబ్లీ వేదికగా రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత కొన్ని సమావేశాలుగా కేసీఆర్ సభకు దూరంగా ఉంటున్నారని, ఈసారైనా ఆయన వచ్చి ప్రజాపక్షాన మాట్లాడాలని సీఎం వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ సమావేశాలలో కీలక బిల్లులతో పాటు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం చర్చలు జరపనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi