రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్యపై ఉత్కంఠ
రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్యపై ఉత్కంఠ
రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్యపై ఉత్కంఠ


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఈరోజు ఉదయం రాష్ట్రవ్యాప్తంగా నూతన ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించింది. ఈ కొత్త ముసాయిదా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య మునుపటి 3.38 కోట్ల నుండి 2.64 కోట్లకు భారీగా తగ్గిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివిధ కారణాల రీత్యా దాదాపు 73 లక్షలకు పైగా ఓటర్లను జాబితా నుండి తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో మరో 92 లక్షల మందికి పైగా ఓటర్లకు ఈసీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. నోటీసులు అందుకున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల అధికారిక గుర్తింపు పత్రాలలో వేటినైనా సమర్పించి తమ ఓటు హక్కు అర్హతను తిరిగి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande