నేడు 55 అజెండాలతో ఏపీ కేబినెట్ సమావేశం
నేడు 55 అజెండాలతో ఏపీ కేబినెట్ సమావేశం
Chandrababu Naidu(file)


అమరావతి, 18 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) క్యాబినెట్ సమావేశ జరగనుంది. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై క్యాబినెట్లో చర్చించనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు.

అమరావతి రైల్వేలైన్ కోసం ల్యాండ్ పూలింగ్పై మత్రులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుపై క్యాబినెట్లో మాట్లాడనున్నారు. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి.. కొత్త కమిషన్ బిల్లుకు ప్రతిపాదనపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande