ఎయిడెడ్ పాఠశాలలను.మూసివేయడం లేదు /మంత్రి నారా.లోకేష్
ఎయిడెడ్ పాఠశాలలను.మూసివేయడం లేదు /మంత్రి నారా.లోకేష్
Lokesh


అమరావతి, 18 ఆగస్టు (హి.స.)

అమరావతి, ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్సమాధానం ఇచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయటం లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గటంపై లోకేశ్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24, 2024-25లో మూడుశాతం తగ్గిందని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 లో 1.69శాతం తగ్గిందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో 0.94 శాతం ప్రవేశాలు పెరిగాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande