
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
హైటెక్ సిటీ ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో రెండేళ్లపాటు నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్ట్ చుట్టూ రెండేళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. నేటి నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచే కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే విధానాన్ని అమలు చేశారు. తాజాగా దీనిపై సీపీ సజ్జనార్ వాహనదారులకు కీలక విజ్ఞప్తి చేశారు. వన్ వే కు సహకరించాలని కోరారు. రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను గుర్తించామని, ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. దాదాపు 1000 మంది సిబ్బందితో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ప్రాంతంలో బస్టాప్ ల మార్పుపై కూడా ఆర్టీసీతో చర్చిస్తున్నామని, ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాప్ లను రీ షూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా.. రెండేళ్లపాటు కేబీఆర్ పార్క్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు