
నల్గొండ, 18 ఆగస్టు (హి.స.)
నల్గొండ నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శేషమ్మగూడెం 3వ డివిజన్ ఎస్టీ కాలనీ-పాతపల్లె బ్రిడ్జి రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి� ఇవాళ(మంగళవారం) శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న ఈ పనులతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. నల్గొండను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడం తన లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్పొరేషన్లోని 48 డివిజన్లలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
రామగిరి చౌరస్తా-గడియారం సెంటర్-ఎమ్మార్వో కార్యాలయం-భాస్కర్ టాకీస్ వరకు జాతీయ రహదారి అభివృద్ధికి మరో రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమేనని, అభివృద్ధి పనులు కనిపిస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా నల్గొండ ప్రగతికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు