
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో తెలంగాణ రక్షణ
సేన అధికారంలోకి వస్తే 'భూ లక్ష్మి పథకం' కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని కవిత సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలే కావొచ్చు కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమీ, అడవి అంటే పంచప్రాణాలు అని రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు జరిగినా ముందుగా తీసుకుంటున్నవి అసైండ్ భూములేనని మండిపడ్డారు. రాష్ట్రంలో భూమి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్లు భూ దొంగలు అని అనగనగా ఒక రాజు ఏడుగురు కొడుకులు అన్నట్లుగా రేవంత్ రెడ్డి సోదరుల బూదోపిడీ సాగుతోందని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల పాలన సాగుతోందని ఇంత మంది రాజ్యాంగేతర శక్తుల దోపిడీ ఏంటని ప్రశ్నించారు. 30 వేల అసైండ్ భూములను ఈ ప్రభుత్వం లాగేసుకుందని ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదల అసెండ్ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని చాలెంజ్ చేశారు. ప్రొఫెసర్ జయంతి సందర్భంగా తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలనే సంకల్పం తీసుకోగానే గత 31 నెలల్లో ఏనాడూ సామాజిక న్యాయం పదం ఉచ్ఛరించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారన్నారు. సామాజిక అన్యాయం అనబోయి సామాజిక న్యాయం అన్నారని రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మవద్దన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లోనే సామాజిక న్యాయం లేదని, పదవులు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఎస్సీ ఎస్టీ, బీసీలు ఎందుకు న్యాయం చేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి మేకవన్నేపులిలాంటి వాడని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు