ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించింది: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించింది: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
Tpcc


హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)

ఎన్నికల సంఘం అకారణంగా,

నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా పేద ప్రజలు, వలస కూలీలే తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ్వలు) అసలు ఎవరి ఇంటికీ వెళ్లకుండానే సర్వే ప్రక్రియను ముగించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చుకుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అకారణంగా దాదాపు 73 లక్షల ఓట్లను ఈసీ తొలగించిందని, ఇది ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టి నిబంధనలు విధిస్తూ అర్హులైన పౌరులకు ఓటు హక్కు దూరమయ్యేలా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు. పాత జాబితాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ పౌరునికి వెంటనే ఓటు హక్కు కల్పించాలని ఈ సందర్భంగా మహేశ్కుమార్గ్రౌడ్ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande