రేణిగుంట గంగమ్మ తల్లి జాతర......భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ట బందోబస్తు
రేణిగుంట గంగమ్మ తల్లి జాతర......భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ట బందోబస్తు
renigunta-strict-police-security-arranged-for-gangamma-jathara-


రేణిగుంట, 18 ఆగస్టు (హి.స.)రేణిగుంట గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు.

జాతరను పురస్కరించుకుని ఆలయ పరిసరాలు, ప్రధాన వీధులను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రివేళ విద్యుత్ కాంతులతో రేణిగుంట పట్టణం కొత్త శోభను సంతరించుకుంది. జాతరకు తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంతం సందడిగా మారింది.

గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనల మేరకు సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని జాతర పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ జయచంద్ర తెలిపారు.

జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జాతర ఆలయ పరిసరాలు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్రమబద్ధంగా రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు.

జాతరలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురికాకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచడంతో పాటు భక్తులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. జాతర ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు భక్తులు పోలీసులకు సహకరించాలని సీఐ జయచంద్ర సూచించారు. రహదారులపై వాహనాలను ఇష్టానుసారంగా నిలపకుండా, పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు, రైటర్ చలపతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande