వేగినాటి కోటయ్య కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్!
యర్రగొండపాలెం వేగినాటి కోటయ్య కాలనీలో సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. 16 బైక్లు స్వాధీనం, సైబర్ మోసాలపై అవగాహన.
వేగినాటి కోటయ్య కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్!


మార్కాపురం, 18 ఆగస్టు (హి.స.) మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వేగినాటి కోటయ్య కాలనీలో సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో కలిసి కాలనీలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీ ప్రజలు గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం అవుతాయని సీఐ అజయ్ కుమార్ సూచించారు.

అదేవిధంగా పోలీసు శాఖలో డిజిటల్ అరెస్టులు ఉండవని సీఐ స్పష్టం చేశారు. ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశామని చెబితే నమ్మవద్దని, అలాంటి మోసపూరిత కాల్స్పై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో పోలీసులు సత్ప్రవర్తనతో మెలుగుతూ, పరస్పరం కలిసిమెలిసి ఉండాలని, గొడవలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande