బీ సీ లకు 34 శాతం రిజర్వేషన్లు.కల్పిస్తూ కూటమి చారిత్రాత్మక నిర్ణయం
బీ సీ లకు 34 శాతం రిజర్వేషన్లు.కల్పిస్తూ కూటమి చారిత్రాత్మక నిర్ణయం
బీ సీ లకు 34 శాతం రిజర్వేషన్లు.కల్పిస్తూ కూటమి చారిత్రాత్మక నిర్ణయం


అమరావతి, 19 ఆగస్టు (హి.స.)

గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు. తొలుత మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలినారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు ఎన్టీఆర్ కృషి చేశారని, ఆ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు మొట్టమొదటిసారిగా 1995లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని, ఉమ్మడి ఏపీలో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించినవారేనని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడంతో 16వేల మందికి పైగా బీసీలు పదవులకు దూరమయ్యారని సవిత ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలపై దమనకాండ: మంత్రి అచ్చెన్న

గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దమనకాండ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలో బీసీలపై దాడులు చేసి, వారిని జైలులో పెట్టారని తెలిపారు. బీసీలపై వైఎస్. రాజశేఖర్రెడ్డి, జగన్ కక్షగట్టి మరీ ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్.. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించకుండా వదిలేశారని విమర్శించారు. అక్టోబరు నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అచ్చెన్న స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande