
తుళ్లూరు,, 19 ఆగస్టు (హి.స.)
వెంకటపాలెం రెవెన్యూ పరిధిలో కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆశ్రమంలో అల్యూమినియం, చెక్కతో తయారు చేసిన ఫిజియోథెరపీ, జిమ్ భవనంలో మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన ఆశ్రమ సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారు. మంగళగిరి నుంచి శకటం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? ఘటన జరిగిన ప్రాంతంలో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ