
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్,
ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ ఇస్మాయిల్ గుడాలో ఉద్రిక్తత నెలకొంది. వసంత్ వ్యాలీ కాలనీలో శ్మశాన వాటిక ప్రహరీని మంగళవారం రాత్రి కూల్చివేయడంతో బుధవారం ఉదయం ఇస్మాయిల్ ఖాన్ గుడి వాసులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూల్చి వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వసంత్ వ్యాలీ కాలనీ వాసులు, రియల్టర్లకు మద్దతుగా పోలీసులే దగ్గరుండి స్మశాన వాటిక ప్రహరి గోడను కూల్చి వేయించారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటకముందే నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పలువురిని అరెస్టు చేశారు.
శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూల్చి వేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చెప్పినందుకు వచ్చిన వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఇస్మాయిల్ ఖాన్ గుడా వాసులు మండిపడుతున్నారు. మహిళలని చూడకుండా బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి లాఠిఛార్జ్ చేశారని తెలిపారు. నిరసన చేపడుతున్న ప్రజలతోపాటు న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లను సైతం బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి అత్యుత్సాహం కనబరిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..