
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
నర్సంపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా నర్సంపేటకు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ మండలాల నుంచి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు నర్సంపేట పట్టణానికి తరలివస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు