మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు
Mavas


హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)

ఎన్ఐఏ (NIA) నమోదు చేసిన కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య (Gade Inniah) అలియాస్ గాదె ఇన్నా రెడ్డికి (Telangana High Court) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ.25 వేల అదనపు పూచీకత్తుతో రెండు షూరిటీ బాండ్లను సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ వ్యవధిలో ప్రతి శుక్రవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ఎదుట విధిగా తప్పనిసరిగా హాజరుకావాలని షరతు విధించింది.

కాగా, మావోయిస్టు పార్టీ (Maoist Party) భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఛత్తీస్గఢ్ జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు నేత కాటా ໖໖ (Kata Ramachandra Reddy) అలియాస్ వికల్ప్ మరణించారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన గాదె ఇన్నయ్య ప్రసంగం మావోయిస్టులకు అనుకూలంగా ఉందని, ఉద్యమాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉందని ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ప్రజలు మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యేలా ఇన్నయ్య ప్రసంగం ఉందని ఆరోపిస్తూ.. ఎన్ఐఏ ఆయనపై 'ఉపా చట్టం' కింద కేసు నమోదు చేసి గత సంవత్సరం డిసెంబర్ 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande