ప్రభుత్వ పాఠశాలలో మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పాఠశాలలో మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ
Minister


నారాయణపేట, 19 ఆగస్టు (హి.స.)

మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడి విద్యాబోధన, చదువుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించి, విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో చిన్నపొర్ల-పెద్దపొర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande