హైదరాబాద్ ఈడీ ఆఫీస్లో నిధి అగర్వాల్.. హవాలా నిధులపై ఆరా
హైదరాబాద్ ఈడీ ఆఫీస్లో నిధి అగర్వాల్.. హవాలా నిధులపై ఆరా
Nidhi Agarwal


హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)

ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి హాజరయ్యారు. పలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు హవాలా మార్గాల ద్వారా నిధులు స్వీకరించినట్లు నిధి అగర్వాల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె స్టేట్మెంట్ను ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. గతంలో కూడా ఈ కేసులో భాగంగా ఆమెను సీఐడీ (CID) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే ఇటువంటి అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడంలో సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై ఈడీ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్ల ద్వారా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్తో పాటు సుమారు 29 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను ఈడీ రిపోర్ట చేర్చింది. ఈ జాబితాలో ఉన్న వారిలో నటుడు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల ఉన్నారు. వీరితో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విచారణను ఎదుర్కొంంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేయగా, మరికొందరిని విచారణ నిమిత్తం పిలిపించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande