
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లిలో ప్రధాన రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలు, ఇతర ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం తొలగించారు. రహదారిపై ఆక్రమణల కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
ఆక్రమణల తొలగింపు సందర్భంగా కొంతమంది స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ అధికారులు వెనక్కి తగ్గకుండా కూల్చివేతలను కొనసాగించారు. రహదారులపై ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..