కదిరిలో ఈనెల 22న మెగా జాబ్ మేళా!
కదిరిలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న మెగా జాబ్ మేళా. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు - డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి.
/abhijna-foundation-mega-job-mela-on-august-22-in-kadiri-174677


కదిరి, 19 ఆగస్టు (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా కదిరి పరిసర ప్రాంతాల మరియు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 22 వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డా. పి.వి. పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 30కి పైగా ప్రముఖ. కంపెనీలు సుమారు 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని, విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో పర్యటించినప్పుడు ఇక్కడ యువత ఉద్యోగాలు లేక పడుతున్న కష్టాలు తాను గుర్తించానన్నారు. అందుకోసమే వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మెగాజాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో కూడా ఇలాగా మరో మెగాజాబ్ మేళాను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. మెగాజాబ్మేళాను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande