
రాయచోటి, 19 ఆగస్టు (హి.స.)అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ రోజు ట్రాఫిక్ సీఐ చాంద్బాషా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫామ్లు ఐడీ కార్డులు పంపిణీ చేశారు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్యశిబిరం, కంటి పరీక్షల శిబిరాన్ని స్థానిక నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. అలాగే ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సూచించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి, వారికి అన్ని విధాల సాయం అందించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఆటో డ్రైవర్లు పోలీసులతో సహకరించాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV