
తిరుమల , 19 ఆగస్టు (హి.స.)కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచన చేసింది. తిరుపతి పట్టణంలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద నిర్వహించే ఎస్ఎస్డీ టోకెన్ల (SSD Tokens) జారీ కేంద్రాలను టీటీడీ ఇవాళ మూసివేసింది. ఈ కేంద్రాల్లో టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేయడంతో కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తుల రద్దీ, ఇతర నిర్వహణ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ మార్పుల నేపథ్యంలో తిరుపతిలో టోకెన్ల కోసం నిరీక్షించకుండా, భక్తులు రేపు నేరుగా తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తిరుమలకు చేరుకున్న తరువాత నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV