
కర్నూలు , 19 ఆగస్టు (హి.స.)కర్నూలు నగరంలోని రహదారుల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేం దుకు 3 మెకానికల్ రోడ్ స్వీపర్ వాహనాలను వినియోగిస్తూ రాత్రిం బవళ్లు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టామని, గతంలో రాత్రిపూట మాత్రమే కొన్ని ప్రధాన రోడ్లను శుభ్రపరిచేవారని, ఇకపై పగలు, రాత్రి 16గంటలు శుభ్రపరిచేలా అదనపు సిబ్బందిని నియమించా మన్నారు.
ఈ రోజు వై.జంక్షన వద్ద పెద్దపాడు రోడ్డులో మెకా నికల్ రోడ్డుస్వీపర్ వాహనం పనితీరును కమిషనర్ పరిశీలించారు. అనంతరం పరిమళ నగర్లో అన్న క్యాంటీనను తనిఖీ చేశారు. ఏసీపీ నాగరాజు, టీఏఈ ఖాసిం వలి, శానిటరీ ఇనస్పెక్టర్లు అలీం బాషా, హుస్సేన, శ్రీనివాసులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV