శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు.. ఒక్క రోజే ఎన్నికోట్లు వచ్చాయంటే?
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. హుండీ ఆదాయంలో మంగళవారం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. నిన్న ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది.
తిరుమల


తిరుమల , 19 ఆగస్టు (హి.స.) తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. హుండీ ఆదాయంలో మంగళవారం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. నిన్న ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఇకక తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అన్ని కంపార్టుమెంట్లలో శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిరోజులుగా భారీగానే ఉంది. తరచూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వర్షాకాలం అయినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండటంతో భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande