సంగం సబ్స్టేషన్ వద్ద విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన!
సంగం సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతుల నిరసన. 9 గంటల విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే సబ్స్టేషన్ను దిగ్బంధిస్తామని హెచ్చరిక.
సంగం సబ్స్టేషన్ వద్ద విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన!


నెల్లూరు, 19 ఆగస్టు (హి.స.) నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు ఈ రోజు ఆందోళన చేపట్టారు.

వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ నిరసన తెలిపారు. అధికారులు ఏకపక్షంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి కాలువ కింద సుమారు 30 ఏళ్లుగా చిన్న, సన్నకారు, కౌలు రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వారానికి మూడు రోజులు విద్యుత్ ఇచ్చి, నాలుగు రోజులు కోత విధించడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు 15 వేల ఎకరాల సాగుపై విద్యుత్ కోతల ప్రభావం పడుతోందని తెలిపారు. రాత్రి 12 గంటల తర్వాతైనా పాత పద్ధతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే పురుగుమందు డబ్బాలతో సుమారు 150 మంది రైతులతో సబ్స్టేషన్ను దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande