మినీ మార్ట్ ల ద్వారా రేషన్.బియ్యం బ్లాక్.మార్కెట్ ను.అడ్డుకుంటామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
మినీ మార్ట్ ల ద్వారా రేషన్.బియ్యం బ్లాక్.మార్కెట్ ను.అడ్డుకుంటామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
నాదెండ్ల


అమరావతి, 02 ఆగస్టు (హి.స.)

మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను అడ్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవల బియ్యం ధరలు కిలోకు రూ.పది పెరిగాయని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో మంత్రి నాదెండ్ల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

తమ పౌరసరఫరల శాఖ ఆధ్వర్యంలో 50, 52 కిలోల చొప్పున పదికిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణ విషయంలో ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. నేడు ఎక్కడ చూసినా కిలో రూ.64లు బియ్యం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.50లకే ఇస్తుందని వెల్లడించారు. 150 కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ బియ్యాన్ని అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో వెయ్యి మినీ మార్ట్లు తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత అదనంగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలకు సరుకులు ఇస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 70 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తామని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ఈ మినీమార్ట్ల ఏర్పాటుతో డీలర్లకు ఆదాయం పెరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande