నామినేటెడ్ పోస్టులకు రంగం సిద్ధం
తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది.
Revanthreddy


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.) తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమై నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను ఖరారు చేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) డైరెక్టర్లు, ఛైర్మన్ల పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర కీలక నామినేటెడ్ పోస్టులను త్వరితగతిన, పారదర్శకంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పదవుల్లో పెద్దపీట వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

60 శాతం పోస్టులను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గసభ్యులు, అనుబంధ సంఘాల నాయకులకు కేటాయించనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల ని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు తమ పరిధిలోని జిల్లా మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, సీనియ ర్ నేతలతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయి నుంచి అర్హులైన ఆశావాహుల పేర్లతో కూడి న నివేదికను సిద్ధం చేయాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించారు. ఆ నివేదికలపై ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు చర్చించి, నామినేటెడ్ పోస్టుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande