
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థానం అధికారులు సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాల సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్