ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని తెలంగాణ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Seethakka


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) వ్యాఖ్యానించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘తల్లి పాలే శిశువుకు తొలి హక్కు.. తొలి టీకా’ అని తెలిపారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు.

బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలి..

బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. మొదటి 6 నెలలు కేవలం ఈ పాలే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలపై అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పాలపై ఉన్న అపోహలను తొలగిద్దామని తెలిపారు. ఆరోగ్యవంతమైన చిన్నారులే ఆరోగ్య తెలంగాణకు పునాది అని ఉద్ఘాటించారు. ప్రతి ఇంటికి 'తల్లి పాలే తొలి టీకా' సందేశం తీసుకెళ్లాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యంపై సమాజమంతా బాధ్యత తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande