సమర్థ పోరాటంతోనే ప్రాజెక్టులపై సుప్రీం అనుకూల తీర్పు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం
Revanthreddy


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)గౌరవెల్లి ప్రాజెక్టుతోపాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, అభిషేక్ సింఘ్వీ లాంటి సీనియర్ న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో సమర్థంగా పోరాడిన ఫలితంగానే ఈ అనుకూల తీర్పు వచ్చింది. ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి’ అని పేర్కొన్నారు.

విద్వేషపూరిత ప్రసంగాల నివారణ బిల్లుపై త్వరలో నివేదిక

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల (నివారణ) బిల్లు-2026పై త్వరలోనే శాసనసభకు నివేదిక అందజేస్తామని సెలెక్ట్ కమిటీ ఛైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం శాసనసభలో స్పీకర్ కార్యాలయంలో పొన్నం అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది. శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, సభ్యులు దానం నాగేందర్, కోవ లక్ష్మి, మధుసూదన్రెడ్డి, లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని, మాణిక్రావు, కూనంనేని సాంబశివరావు, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలతోపాటు శాసనసభ, మండలి కార్యదర్శులు తిరుపతి, నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande