అనంతపురంలో షాకింగ్ ఘటన.. కూతురిపై కన్ను.. ప్రియుడి మర్మాంగం కోసేసిన తల్లి!
అనంతపురంలో షాకింగ్ ఘటన.. కూతురిపై కన్ను.. ప్రియుడి మర్మాంగం కోసేసిన తల్లి!
/anantapur-shocking-incident-mother-cuts-off-lovers-private-parts-for-harassing-daughter


అనంతపురం, 02 ఆగస్టు (హి.స.)అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తూ, తన కూతురిపైనే కన్నేసిన వ్యక్తికి ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేశ్కు వివాహమైంది. అయినప్పటికీ, డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు డిగ్రీ చదువుతున్న కూతురు ఉంది. కొంతకాలంగా సురేశ్, ఆమె కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లికి చెప్పడంతో, సురేశ్కు ఎలాగైనా గుణపాఠం నేర్పాలని ఆమె నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో నిన్న రాత్రి సురేశ్ యథావిధిగా ఆమె ఇంటికి వచ్చాడు. ఇదే సరైన సమయమని భావించిన మహిళ, అతడిని మాటల్లో పెట్టింది. ఓ చీరతో సురేశ్ కాళ్లు, చేతులు కట్టేసి.. నా కూతురి జోలికి వస్తావా అంటూ దాడి చేసింది. ఆ తర్వాత కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది.

నొప్పితో సురేశ్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు విని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన సురేశ్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande