
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)
నిజామాబాద్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ రోజు తెల్లవారుజాము నుండి భక్తుల రాక విశేషంగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడం, శుభ ముహూర్తాలు ఉండటంతో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల నుండి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి జరిగిన ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి, తాగునీరు మరియు ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi