
భద్రాచలం: , 02 ఆగస్టు (హి.స.)
గత కొన్ని రోజులుగా భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది వరద ప్రవాహం ఈ రోజు ఉదయం నుండి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు తగ్గడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు గతంలో జారీ చేసిన రెండు మరియు మూడవ ప్రమాద హెచ్చరికలను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. అయితే తీరప్రాంత లోతట్టు గ్రామాల ప్రజలు ఇంకా కొంతకాలం పాటు అప్రమత్తంగానే ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాలలో మురుగు నీటి తొలగింపు మరియు పారిశుధ్య పనులను అధికారులు వేగవంతం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi