
విజయవాడ:, 02 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించిన సమగ్ర తుది నివేదికలను పౌర విమానయాన శాఖ అధికారులు శనివారం రాత్రి సిద్ధం చేశారు. ఈ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధికి ఒక ప్రధాన మైలురాయిగా మారనుంది. ఉత్తరాంధ్ర మరియు కోస్తా జిల్లాల ప్రజలకు అంతర్జాతీయ స్థాయి విమాన ప్రయాణ సౌకర్యాలను అత్యంత సులభతరం చేయడంతో పాటు, ప్రాంతీయ వాణిజ్యం, పెట్టుబడులు మరియు పర్యాటక రంగాల వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా పనుల వేగాన్ని మరింత పెంచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi